సీఎం జగన్‌కు మరో పేరు నామకరణం చేసిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-04-19 15:00:51.0  )
సీఎం జగన్‌కు మరో పేరు నామకరణం చేసిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు మార్చారు. జే.. గన్ రెడ్డిగా నామకరణం చేశారు. అంతేకాదు జగన్‌ను దుర్మార్గుడని ఆయన సంబోధించారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ లాంటి వ్యక్తి కన్నతల్లికి, జన్మభూమికి భారమని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత డబ్బు ఉన్న వ్యక్తి జగన్ అని చెప్పారు. జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని విమర్శించారు. ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. అన్ని రంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమి అని తెలిపారు. కేంద్ర సహకారం ఏపీకి చాలా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed