- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. 2200 మంది నాయకులతో రేపు ఇంటరాక్ట్
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ నుంచి వెళ్లే నేతలను కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీటు మారిన, సీటు రాని నేతలను సైతం బుజ్జగించే పనిలో పడ్డారు. మరోవైపు వైసీపీ 8వ జాబితాపైనా సమాలోచనలు చేస్తున్నారు. పది రోజుల్లో మొత్తం జాబితాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే 175 సీట్లు గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం జగన్ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇప్పుడు పార్టీ కీలక నేతలతో ఇంటరాక్ట్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంగళగిరి సీకే కన్వేన్షన్ సెంటర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అంతేకాదు అసెంబ్లీ పరిశీలకులు, జేసీఎస్ కో ఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ అసెంబ్లీ, మండల ఇంచార్జులతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణ, కార్యచరణపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 12 మంది బూత్ ఆర్గనైజర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో నేతలతో సీఎం జగన్ చర్చించిన తర్వాత అటు ఐప్యాక్ టీమ్ కూడా భేటీ కానుంది. అలాగే నేతలకు ఐప్యాక్ టీమ్ శిక్షణ ఇవ్వనుంది. ఎన్నికల ముందు నేతలతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అవడంతో మంగళగిరి పార్టీ నేతలు సైతం అప్రమత్తమయ్యారు. పడడ్బందీగా సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.