అప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఢిల్లీ..!

by srinivas |   ( Updated:2025-02-02 17:11:27.0  )
అప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు ఢిల్లీ..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఢిల్లీ(Delhi)లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం(Election Campain) నిర్వహించారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే షాద్ర ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 1995లో హైదరాబాద్(Hyderabad) ఎలా ఉందో ఇప్పుడు ఢిల్లీ అలా ఉందన్నారు. ఢిల్లీలో బీజేపీ(Bjp) సర్కార్ ఉండి ఉంటే వాషింగ్టన్(Washinton), న్యూయార్క్(Newyork) కంటే మిన్నగా ఉందేదని జోస్యం చెప్పారు. ఢిల్లీలో రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉందన్నారు.


ప్రధాని మోడీ(Pm Modi) ఏఐను ప్రోత్సహిస్తున్నారని, ప్రతి ఇంట్లో ఒక నిపుణుడిని తయారు చేయాలని కృషి చేస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు పాలన చేస్తున్నారని, తద్వారా భారత్ పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు. 2047లోపు భారత్ నెంబర్ వన్ దేశంగా మారుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే.. ప్రధాని మోడీ ఆక్సిజన్ ఇవ్వాలని పేర్కొన్నారు.


Next Story

Most Viewed