- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP Budget Sessions: అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పయ్యావుల.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. వచ్చిన పరిశ్రమలను, రాబోయే పెట్టుబడను రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలన చూసిన ప్రజలు 2024లో అపూర్వమైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ఆ సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు ఆయననకు ఆయనే సాటి అని కొనియాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకట్ట వేసి ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థతికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను రూపొందించామని అన్నారు. రెవన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు అని తెలిపారు. అదేవిధంగా మూలధనం అంచనా రూ.40,635 కోట్లు అని సభలో వివరించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
* అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
* పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
* రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ.4,220 కోట్లు
* ఓడరేవులు, ఎయిర్‌పోర్టులకు రూ.605 కోట్లు
* ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
* RTGSకు రూ.101 కోట్లు
* ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలకు రూ.300 కోట్లు
* వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లు
* పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు
* బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు
* వైద్య, ఆరోగ్య శాఖకు రూ.19,265 కోట్లు
* SC, ST, BC స్కాలర్‌షిప్‌లకు రూ.3,377 కోట్లు
* స్వచ్ఛ ఆంధ్రా స్కీమ్‌కు రూ.820 కోట్లు
* పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.18,848 కోట్లు
* జల వనరుల శాఖకు రూ.18,020 కోట్లు
* పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు
* సాఘిక సంక్షేమ శాఖకు రూ.10,909 కోట్లు
* ఆర్థికంగా వెనుబడిన వారి సంక్షేమానికి రూ.10,619 కోట్లు
* NTR భరోసా పెన్షన్లకు రూ.27,518 కోట్లు
* ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
* మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
* తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
* బాల సంజీవనీ పథకానికి రూ.1,163 కోట్లు
* చేనేత, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యత్ రూ,450 కోట్లు
* ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ రూ.400 కోట్లు
* అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
* ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
* సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
* జలజీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు