- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Target Ap: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కీలక బాధ్యతలు

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలన, విజయాలపై రాష్టంలో ప్రచారం చేసేందుకు సోము వీర్రాజు కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డిని నియమించారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు సభ్యులుగా నియమితులయ్యారు. మే 30 నుంచి జూన్ 30 వరకూ ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను బీజేపీ యంత్రాగం కలవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన లక్షల మందిని కలిసి ప్రచారం చేస్తారు. సమాజంలో అన్ని వర్గాల ప్రతినిధులతో కలిసి ప్రజలను చైతన్యవంతం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలు, జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా భేరీ నిర్వహించనున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో ప్రచారం నిర్వహించనున్నారు.