AP: ఏపీలో ఉధృతమైన బర్డ్ ఫ్లూ.. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు

by Shiva |
AP: ఏపీలో ఉధృతమైన బర్డ్ ఫ్లూ.. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కోళ్ల మరణాలకు కారణం ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌5ఎన్‌1 -బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ కారణమని తేలింది. అయితే, ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన శాంపిల్స్‌ను పశు సంవర్ధక శాఖ అధికారులు మధ్యప్రదేశ్‌ (Madya Pradesh)లోని భోపాల్‌ (Bhopal)లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ (ICAR-NIHSID)కి పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండల పరిధిలోని కానూరు ప్రాంతంలోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలను పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లోని కోళ్లను అన్నింటిని పూడ్చిపెట్టేసి సుమారు 2 కి.మీ పరిధిలోని రెడ్‌ అలర్ట్‌ (Red Alert) ప్రకటించారు.

ఈ క్రమంలోనే పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఏపీ వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) ఇవాళ సమావేశం అయ్యారు. బర్డ్ ఫ్లూ వైరస్ (Bird Flu Virus) ఉన్న ప్రాంతాల్లో ఎల్లప్పుడూ వెటర్నరీ వైద్యులు అందబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ ఉధృతిని బట్టి ఆయా ప్రాంతాలను జోన్ల ప్రకారం విడదీసీ ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని అన్నారు. ఇక అన్ని పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మేజర్స్ పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన సంబంధిత పౌల్ట్రీల వద్ద కోళ్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.



Next Story