AP Assembly: దొంగచాటుగా వస్తున్నారు.. వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
AP Assembly: దొంగచాటుగా వస్తున్నారు.. వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిననున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyanna Pathrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA's)లు సభకు హాజరుకాకుండా.. దొంగచాటుగా అసెంబ్లీ (Assembly)కి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే అటెండెన్స్ రిజిస్టర్‌ (Attendance Register)లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఏంటిని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రశ్నలు వేస్తున్నారే తప్ప.. సభకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. సంతకాలు పెట్టిన వాళ్లు తనకు సభలో కనబడాలి కదా.. అంటూ సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు రావాలని స్పీకర్ అయన్న పాత్రుడు వారికి సూచించారు.

కాగా, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై ఏపీ ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా (Retired IAS officer Rajiv Ranjan Mishra) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ (One man commission) నివేదికను కేబినెట్‌కు అందజేసింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్‌ మూడు కేటగిరీలుగా రూపొందించింది. గ్రూప్‌-1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP budget meetings) కొనసాగుతుండగా.. ఇవాళ సభలో ఎస్సీ వర్గీకరణ నివేకను ప్రవేశ పెట్టబోతున్నారు



Next Story