AP Assembly: సభలో ప్రశ్నోత్తరాలపై స్పీకర్ అయ్యన్న అసహనం.. మంత్రులపై కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-03-04 04:57:26.0  )
AP Assembly: సభలో ప్రశ్నోత్తరాలపై స్పీకర్ అయ్యన్న అసహనం.. మంత్రులపై కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగో రోజు బడ్జెట్ సమావేశాలు (Budget ఛeetings) ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) పశ్నోత్తరాలతో సభను మొదలు పెట్టారు. నేటిలో సభలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల (White Rations Cards) జారీ, భూ వివాద అంశాలు (Land Dispute Issues) కశ్వన్ అవర్‌ (Question Hour)లో సభ ముందుకు రానున్నాయి. అయితే, ప్రశ్నోత్తరాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సెషల్‌లో మొదటి ఆరు ప్రశ్నలు వాయిదా పడటంపై ఆయన ఓకింత అసహనం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నగా ఏడో ప్రశ్న రావడం ఏంటని అన్నారు.

అదేవిధంగా రెండు ప్రశ్నలు వేసి సభకు హాజరు కాని వైసీపీ (YCP) సభ్యులపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే మూడు ప్రశ్నలను వాయిదా వేయాలని కూటమి సభ్యులు స్పీకర్ కోరారు. ఇక ఆరో ప్రశ్నకు సమాధానం చేప్పేందుకు సభలో మంత్రి అందుబాటులో లేకపోవడం.. మంత్రలు సమయానికి అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల (White Rations Cards) జారీ, భూ వివాద అంశాలు (Land Dispute Issues) సభ ముందుకు రానున్నాయి.

Next Story

Most Viewed