- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP Assembly: ఈసారికి జగన్‌ను క్షమిస్తున్నా.. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఐదో రోజు బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సభ ప్రారంభంలోనే ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం జగన్ రాసిన లేఖను అందులోని అంశాలను బహిర్గతం చేయాలని మంత్రి ఫారూఖ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. ఈ మేరకు స్పీకర్ సభలో జగన్ రాసిన లేఖలోని అంశాలు సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 24, 2024న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు లేఖ రాశారని సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన రాసిన లేఖలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు చేశారని ఆరోపించారు. తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేశారని ఫైర్ అయ్యారు.
కొద్దిరోజుల తరువాత జగన్ హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శి.. స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలంటూ పిటిషన్ వేశారని తెలిపారు. అయితే, ఆ పిటిషన్ విచారణకు అర్హత పొందే దశలోనే ఉందని అన్నారు. పిటిషన్‌లో స్పీకర్, శాసనసభా వ్యవహహారాల మంత్రిని మినహాయించాలని అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తిని కోర్టు అనుమతించింది. ఈ క్రమంలోనే స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించినట్లుగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ అర్హత పొందని రిట్ పిటిషన్‌పై అలా తప్పుడు ప్రచారం చేయడం బాధకరమని అన్నారు. ఈ మేరకు ఆ ప్రచారంపై రూలింగ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం స్పీకర్‌కు ఉంటుందని 2024 జూన్ 20 వరకు జగన్ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు కనీసం స్పీకర్ కార్యాలయానికి తెలుపలేదని అన్నారు. స్పీకర్ ప్రయాణ స్వీకారానికి ముందే ప్రతిపక్ష హోదా ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు.
సెక్షన్ 12B స్పీకర్ నిర్ణయానికి తిరుగుండదని అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా కావాలంటూ 1/10 సభ్యులు ఉండాలని అన్నారు. ఈ సభలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని అన్నారు. బెదిరింపులు, అభియోగాలతో వైఎస్ జగన్ తనకు లేఖ రాశారని.. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కలు ఉల్లంఘనేనని అన్నారు. అయితే, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను క్షమిస్తున్నానని తెలిపారు. జగన్ ఇలానే వ్యవహరిస్తే ఏం చేయాలో సభకే వదిలి పెడుతున్నానని, ఆయన ఇప్పటికైనా సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కామెంట్ చేశారు.