- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP Assembly: నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు.. ఆ నివేదికపై కీలక చర్చ!

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. దాదాపు పదిహేను రోజుల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాల్లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులు, చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ్టి సభలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన (One Man Commission) నివేదికపై అన్ని పార్టీల నాయకులు మాట్లాడి, చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యే (MLA), ఎమ్మెల్సీ(MLC's)ల క్రీడాపోటీలు నేటితో ముగియనున్నాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులను ప్రదానం చేయనున్నారు.
కాగా, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (Classification of SC)పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా (Retired IAS officer Rajiv Ranjan Mishra) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ (One man commission) నివేదికను కేబినెట్‌కు అందజేసింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్ మూడు కేటగిరీలుగా రూపొందించింది. గ్రూప్-1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP budget meetings) కొనసాగుతుండగా.. ఇవాళ సభలో ఎస్సీ వర్గీకరణ నివేకను ప్రవేశ పెట్టబోతున్నారు