నిధుల మళ్లింపులో సునీల్‌ కుమార్‌ పాత్ర ఉంది.. ఏసీబీ డీజీకి RRR మరో లేఖ

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-17 15:49:48.0  )
నిధుల మళ్లింపులో సునీల్‌ కుమార్‌ పాత్ర ఉంది.. ఏసీబీ డీజీకి RRR మరో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ డీజీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishnam Raju) మరో లేఖ రాశారు. ప్రైవేట్ టెక్నాలజీస్ కాంట్రాక్ట్ నిధుల(Private Technologies Contract Funding) మళ్లింపులో మాజీ CID చీఫ్ సునీల్‌ కుమార్‌(Former CID chief Sunil Kumar) పాత్ర ఉందని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. రూ.75 లక్షలు నకిలీ ఖాతాలకు మళ్లించారని పేర్కొన్నారు. మిగతా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బు ఇవ్వకపోతే నార్కోటిక్ కేస్ పెడతానంటూ అగ్రిగోల్డ్‌ కేసు(Agri Gold Case)లో సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తులసిబాబుతో కలిసి నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. 96 మంది నకిలీ బాధితులకు రూ.75 లక్షల డబ్బులు పంపారని చెప్పారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed