- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kethireddy Vs Lokesh: 24 గంటల్లో నిరూపించాలి..

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌కు ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించలేకపొతే నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్యాకప్ చెప్పి, తండ్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ఛాలెంజ్ చేశారు.
కాగా యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ ఆదివారం ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఫామ్‌హౌస్ వీడియోను రిలీజ్ చేశారు. ధర్మవరంలో చెరువును ఆక్రమించుకుని ఫామ్ హౌస్ నిర్మించారని లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు.
ఉండవల్లిలోని కరకట్ట వద్ద చంద్రబాబు నివాస సమీపానికి వెళ్లారు. అక్కడ ఫేస్ బుక్ లైవ్ ఇచ్చారు. చంద్రబాబు నివాసాన్ని చూపిస్తూ ఇది అక్రమ కట్టడం కాదా అని ప్రశ్నించారు. తాను రైతుల వద్ద భూములు కొనుగోలు చేసి నివాసం ఏర్పాటు చేసుకున్నానని, చంద్రబాబు మాదిరిగా రైతులను బెదిరించి నది వెంట భూములు లాక్కుని ఫామ్ హౌస్‌లు నిర్మించలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.
Also Read..