Tadipatri: మున్సిపల్ కార్యాలయంలో అరుదైన దృశ్యం

by srinivas |
Tadipatri: మున్సిపల్ కార్యాలయంలో అరుదైన దృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అరుదైన దృశ్యం కనిపించింది. తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఉండగా ఆయన తనయుడు జేసీ అష్మిత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. జేసీ అష్మిత్ రెడ్డి గతంలో కౌన్సిలర్‌గా పని చేశారు. తాజాగా ఎమ్మెల్యేగా గెలిచి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా రావడంపై అష్మిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తాడిపత్రి అభివృద్ధిని ఆకాంక్షిస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అష్మిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అష్మిత్ రెడ్డిని కౌన్సిలర్లందరూ అభినందించారు. తనయుడు అష్మిత్ రెడ్డికి శాలువా కప్పి తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి బొకే ఇచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

కాగా గత ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ కూటమి నుంచి పోటీ చేసి జేసీ అష్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అష్మిత్ రెడ్డిపైనా కేసులు నమోదు అయ్యాయి. అక్రమంగా తమపై కేసులు పెట్టారని అప్పట్లోనే జగన్ ప్రభుత్వంపై జేసీ అష్మిత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన జేసీ అష్మిత్ రెడ్డి 2014 ఎన్నికల్లో తాడిపత్రి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed