- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దిశ, కళ్యాణదుర్గం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంబదూరు మండల పరిధిలోని కురాకులపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కూరాకులపల్లి గ్రామానికి చెందిన గొల్ల మంజునాథ్ (40) అనే రైతు చాలా సంవత్సరాల నుంచి తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేస్తున్నాడు. కానీ పంటలో ప్రతి సంవత్సరం నష్టం రావడంతో ఈ క్రమంలో ఆయనకు రూ. 10 లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఈ సంవత్సరం కూడా తన పొలంలో టమోటా, మిరప, వేరుశనగ పంటలు సాగు చేశాడు. ఆ పంటలు కూడా బోరు బావిలో నీరు లేక నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పులు చేసి పొలంలో బోర్లు వేయించుకోగా నీరు పడకపోవడంతో పంటల్లో దిగుబడి రాక అప్పుల అధికమవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు కంబదూరు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.