వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

by Jakkula Mamatha |
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
X

దిశ, మడకశిర: వైసీపీ కాంగ్రెస్ నుంచి 50 కుటుంబాలు ఆదివారం టీడీపీలోకి చేరాయి. అమరాపురం మండలం హేమావతి పంచాయితీ గుణె హాళ్ళి గ్రామానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హనుమంత రాయప్ప మాజీ సర్పంచ్, తిప్పేస్వామి, హనుమంతరాయ, కృష్ణప్ప, ఈరప్ప, మారే గౌడ్, కృష్ణమూర్తి చెన్నప్ప, హరీష్ వీరితో పాటు 50 కుటుంబాలు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరాయి. వీరికి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కృషికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామన్నారు.


Next Story

Most Viewed