వైఎస్ చైర్మన్లు రాజీనామా.. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం

by srinivas |   ( Updated:26 Jan 2025 1:11 PM  )
వైఎస్ చైర్మన్లు రాజీనామా.. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) భావోద్వేగాని(Emotional)కి గురయ్యారు. మున్సిపల్ చైర్మన్లు అబ్దుల్ రహీం, సరస్వతి రాజీనామా చేశారు. వారి రాజీనామాకు ఆమోదం తెలిపిన ఆయన ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి కౌన్సిలర్లు ఎక్కడా ఉండరని, చక్కగా పని చేశారని చెప్పారు. తనకు మంచి కౌన్సిలర్లు దొరకడం అదృష్టమన్నారు. తానెప్పుడు వారికి రుణపడి ఉంటానన్నారు. తన పిల్లల సాక్షిగా చెబుతున్నానని, ఇలాంటి కౌన్సిలర్లు తనకు చిక్కరని తెలిపారు. తనకు రెండు రాష్ట్రాల్లో పేరు వచ్చిందంటే ఈ కౌన్సిలర్ల వల్లనేనని ప్రభాకర్ రెడ్డి చెప్పారు.


డబ్బులు వస్తాయని.. పోతాయని, కానీ ఇలాంటి కౌన్సిలర్లు ఎవరికీ చిక్కరని జేసీ వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌన్సిలర్లు అమ్ముడుపోతున్నారని, కానీ తనకు ఇంత పేరు తెచ్చింది మాత్రం తమరేనని వారిని సన్మానించారు. మంచి కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టే తాడిపత్రి మున్సిపాలిటీ చాలా గట్టిగా ఉందని తెలిపారు. తాను ఎవరినీ బాధపెట్టనని చెప్పారు. ‘‘తాడిపత్రి నన్ను చాకింది. ఈ ఊరికి రుణపడి ఉన్నా. మున్సిపల్ సిబ్బంది నాకు సహకరించారు. ఆరు నెలలు ఆగితే మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్లీ అవకాశం వస్తుంది.’’ అని వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Next Story