- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేనలో ఊహించని పరిణామం.. పిఠాపురంలో ఒక్కసారిగా పెరిగిన బలం
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాముడిని దర్శించుకునేందుకు ఆయన అయోధ్య వెళ్లారు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం మండలం కొండెవరానికి చెందిన 1500 మంది ప్రజలు జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకుడు గాది కొండబాబు ఆధ్వర్యంలో పిఠాపురం ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో వీరంతా ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇక్కడ విశేషమేంటంటే జనసేనలో చేరిన 1500 మందిలో 500 మందికిపైగా మహిళలు ఉన్నారు. దీంతో జనసేన వీర నారీ మణుల సంఖ్య భారీగా పెరగబోతోంది.
ఈ పరిణామంతో జనసేన పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో కలిసి పోటీ చేయాలనుకుంటున్న జనసేనకు వీరి చేరిక మరింత బలం చేకూర్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో వీలైనన్నీ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాకినాడ, పిఠపురంతో పాటు పలు నియోజకవర్గాల్లో జనసేన విజయకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. కాబట్టి తప్పనిసరిగా తమకు సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధినేత పవన్ కల్యాణ్‌కు తెలిపారు. దీంతో సీట్లు, అభ్యర్థులపై పార్టీలో కసరత్తులు చేస్తున్నారు. సీట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అధికారికంగా అభ్యర్థులను జనసేన అధిష్టానం ప్రకటించనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.