- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: తీరంలో తీవ్ర విషాదం

దిశ, వెబ్ డెస్క్: సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి ముగ్గురు ప్రాణం పోగొట్టుకోగా మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District) సింగరాయకొండ వద్ద పాకాల సముద్ర తీరం(Pakala Sea)లో చోటు చేసుకుంది. భోగి, సంక్రాంతి, కనుమ పండగ వేడుకల్లో మునిగి తేలిన ఈ నలుగురు.. ఈ రోజు సరదాగా పాక సముద్ర తీరానికి వెళ్లారు. కొంతసేపటికి సముద్రంలోకి దిగారు. కెరటాల నడుమ సరదాగా సందడి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల ఎగిసిపడింది. దీంతో సముద్రంలో ఉన్న నలుగురూ లోపలికి కొట్టుకుపోయారు. అందరూ చూస్తుండగానే నలుగురు నీటిలో మునిగిపోయారు.
ఫలించని పోలీసుల శ్రమ
దీంతో మెరైన్ పోలీసులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే నీళ్లలో ఊపిరాడక ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తి మృతి చెందారు. పవన్ కుమార్ అనే వ్యక్తి గల్లంతు కావడంతో గాలిస్తున్నారు. మరోవైపు ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక మృతుల కుటుంబాల రోదనలు ఆకాశ్నంటాయి. పండగ వేడుకల్లో సరదాగా, ఉత్సాహంగా కనిపించిన తమ వాళ్లు ఇక లేరని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు.