వెల్లంపల్లికి సీటు... మల్లాదికి మొండిచేయి.. విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామం

by srinivas |   ( Updated:2024-01-03 10:25:56.0  )
వెల్లంపల్లికి సీటు... మల్లాదికి మొండిచేయి.. విజయవాడ వైసీపీలో ఆసక్తికర పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు సీఎం జగన్ ఝలక్ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో పోటీ అవకాశం ఆయనకు ఇవ్వడంలేదు. ఎమ్మెల్సీతో సరిపెట్టనున్నారు. అంతేకాదు బెడవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇంచార్జిగా మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఇరువురు కూడా అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడ బ్రదర్స్‌గా పేరున్న మల్లాది, వెల్లంపల్లికి పేరుంది. దీంతో స్నేహితుడి నియోజకవర్గానికి వెళ్లేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయం నుంచి కూడా ఇద్దరూ ఎవరికీ అందుబాటులో లేరు. నియోజవకవర్గం మారడం వల్ల గెలిచే అవకాశం ఉండదేమోనని అటు వెల్లంపల్లి సైతం ఆందోళన చెందుతున్నారట. అయితే స్వయంగా మల్లాది విష్ణుతో మాట్లాడాలని వెల్లంపల్లి నిర్ణయించుకున్నారు. ఈమేరకు మల్లాది విష్ణు నివాసానికి వెల్లంపల్లి వెళ్లనున్నారు. తాజా రాజకీయాలపై పరిస్థితులపై చర్చించనున్నారు.

అయితే విజయవాడ సెంట్రల్‌ను వెల్లంపల్లికి కేటాయించడంతో మల్లాది విష్ణు వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వెల్లంపల్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు విష్ణుకి సీటు కేటాయించకపోవడంతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో వెల్లంపల్లిని ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. పలుచోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed