Ambati Rambabu: డిప్యూటీ సీఎం పవన్ ఓ పిరికివాడు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-02-05 07:00:53.0  )
Ambati Rambabu: డిప్యూటీ సీఎం పవన్ ఓ పిరికివాడు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ (Guntur Corporation Standing Committee) ఎన్నికల్లో టీడీపీ (TDP) వ్యవహరించిన తీరుకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో అవిశ్వాసం అస్త్రాన్ని వాడుతూ.. పాలకవర్గాలను పచ్చ పార్టీ దుర్మార్గంగా కైవసం చేసుకుంటుందని ధ్వజమెత్తారు. గుంటూరు కార్పొరేషన్‌ (Guntur Corporation)లో మొత్తం 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నా.. టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. అన్యాయంగా తమ కార్పొరేటర్లను మభ్యపెట్టి క్రాస్ ఓటింగ్ చేయించారని ఫైర్ అయ్యారు.

ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులపై ఎకరువు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అక్రమాలపై మాట్లాడలేని ఓ పిరికివాడు పవన్‌ అని ఆరోపించారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం సైలెంట్ మోడ్ వీడాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu), పవన్‌ (Pavan)ను స్థాయి సంఘం ఎన్నికల్లో తమ స్థాయి తగ్గించుకుని కార్పొరేటర్ల కోసం వేటాడుతున్నారని కామెంట్ చేశారు. అదేవిధంగా దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం సరిగా అమలు కావడం లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలతో స్థానిక సంస్థలను టీడీపీ (TDP) తమ వశం చేసుకోవాలని చూస్తోందని తెలిపారు. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed