- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking News: వైసీపీని వీడే ప్రసక్తేలేదు.. అక్కడి నుండే నా పోటీ..ఆదాల
దిశ వెబ్ డెస్క్:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్పులు చేర్పులతో కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీలో చోటు చేసుకున్న మార్పులు చేర్పుల కార్యక్రమంతో అసహనం వ్యక్తం చేసిన పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలకు మకాం మార్చారు. మరి కొంతమంది నేతలు పార్టీ మారేందుకు సంసిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను పార్టీ మారుతున్నారా? లేదా?అనే విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై పార్టీ మారుతున్నారు అనే దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారం తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమితులైనప్పటినుండి జరుగుతుందని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ మధ్య ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డితో ఆదాల భేటీ అయిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆ భేటీ పైన స్పందించిన ఆదాల.. ఆ భేటీ కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇక తాను వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
ఇక తాను రానున్న ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదాల పార్టీని వీడుతున్నారు అనే ప్రచారం గతం లోనూ జోరుగా సాగింది. ఆనం కోటంరెడ్డి వంటి అధికార పార్టీ నేతలు టిడిపిలో చేరడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి. గతంలో తాను ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ ఫంక్షన్ లో కలుసుకోగా రాజకీయ విషయాలపై చర్చించుకున్నట్లు.. ఆదాల త్వరలోనే టిడిపిలో చేరుతున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను ఏ పార్టీ మారట్లేదని.. వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ సోమిరెడ్డి వ్యాఖ్యలకు ఆనం ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.