Tirumala: తిరుపతిలో ప్రమాదం.. కూలిన సీలింగ్‌

by D.Reddy |
Tirumala: తిరుపతిలో ప్రమాదం.. కూలిన సీలింగ్‌
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని (Tirupati) మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో (Minerva Grand Hotel) మంగళవారం ప్రమాదం జరిగింది. హోటల్‌లోని గది నంబర్‌ 314లో సీలింగ్‌ ఒక్కసారిగా కూలింది. దీంతో అందులో అద్దెకు దిగిన భక్తులు (Devotees) భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం హోటల్‌ను సీజ్‌ చేసి, ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో భక్తులెవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed