NaraLokesh : ఏఐ సాంకేతికతతో రాష్ట్రాభివృద్ధి వేగవంతం : లోకేశ్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-26 07:27:08.0  )
NaraLokesh : ఏఐ సాంకేతికతతో రాష్ట్రాభివృద్ధి వేగవంతం : లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏఐ సాంకేతికత(AI technology) అవకాశాల వినియోగంతో ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) అభివృద్ధి వేగవంతం కానుందని ఏపీ మంత్రి నారా లోకేశ్(NaraLokesh) ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న నారా లోకేశ్ శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేస్తున్నామని తెలిపారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలాజీ విస్తరణకు డ్రోన్ షో నిర్వహించడం ద్వారా సాంకేతికత విస్తరణకు ప్రభుత్వ లక్ష్యాలను చాటడం జరిగిందన్నారు.


Next Story

Most Viewed