బీరు బాటిళ్లలోడు బోల్తా.. ఎగబడుతున్నజనం.. ఎక్కడో తెలుసా ?

by Seetharam |
బీరు బాటిళ్లలోడు బోల్తా.. ఎగబడుతున్నజనం.. ఎక్కడో తెలుసా ?
X

దిశ,వెబ్‌డెస్క్: రోడ్డుపై బీరు బాటిళ్లలోడు వెళ్తుండగా వ్యాను బోల్తా పడటంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అనీ చేతికి అందినన్నీ బాటిళ్లు తీసుకెళ్లారు. అసలే ఎండలు ఆపై చల్లని బీరు..ఎవరు మాత్రం ఆగగలరు అన్నట్లుగా బీరుబాటిళ్లు తీసుకుని పరుగులు పెట్టారు. ప్రమాదంలో కొన్ని బాటిళ్లు పగిలిపోగా..కొన్ని అట్టాపెట్టెల్లో అలాగే పడిపోయాయి. పగిలిన బాటిళ్లుతప్ప అట్టాపెట్టెల్లోని బీరు బాటిళ్లు అన్నీ జనం తీసుకెళ్లారు. అనకాపల్లి, పరవాడలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వ్యాన్ టర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బీరు బాటిళ్లు ద్వంసమయ్యాయి.

Advertisement

Next Story