- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: దేవదాయ శాఖలో వెలుగులోకి మరో అధికారి బాగోతాలు
దిశ ఏపీ బ్యూరో, అమరావతి: ఏపీలో దేవదాయ శాఖలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత మరో అసిస్టెంట్ కమిషనర్ భూబాగోతాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారని వినోద్ కుమార్‌పై అభియోగం నమోదైంది. దేవదాయ శాఖ భూములకు నిబంధనలకు విరుద్దంగా వినోద్ కుమార్ ఎన్వోసీలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో నాగ పడగల ప్రతిష్టలో వినోద్ కుమార్ స్కాంకు పాల్పడినట్లు తెలిసింది. నాగ ప్రతిష్ట స్కాంలో రూ. 68 లక్షల మేర అవినీతికి వినోద్ కుమార్ పాల్పడినట్లు అభియోగం నమోదైంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో దేవదాయ భూ కుంభకోణాలకు గత ప్రభుత్వ పెద్దలకు సహకరించారని వినోద్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి.