- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. వాళ్లు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను సేకరించే పనిలో ఆయా జిల్లాల డీఈవో నిమగ్నమయ్యారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన సీఈసీ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. రాబోయే ఎన్నికలకు ఇప్పుడు ఉన్న సిబ్బంది ఏమాత్రం సరిపోరని అధికారులు సీఈవోకు వివరించారు. దీంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ ఎలక్షన్ డ్యూటీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. వారిని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించి వారి సేవలను వినియోగించుకోనున్నారు.
అయితే, ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంధ విద్య నియమాలను సవరించింది. వారికి బోధనేతర పనులను అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అధికార వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.