- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Atrocious: విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. తరువాత ఏం జరిగిందంటే..?
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకే రోజు రెండు విషాద ఘటనలు వెలుగు చూడడంతో ఉమ్మడి కర్నూలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్లకు చెందిన హిందుమతి(26) అనే మహిళకు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగాలేదు.
ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు ఉదయం విషం (కల్లాపి పౌడర్) తాగింది. అనంతరం ఏడుస్తున్న తన బిడ్డకు పాలిచ్చింది. దీనితో హిందుమతితోపాటుగా తన బిడ్డ కూడా మృతి చెందింది. ఇక కోసిగి మండలంలోని జంపాపురంలో ఓ కసాయి తండ్రి చిన్నారిని బ్లేడుతో గొంతు కోశాడు. దీనితో రక్తపు మడుగులో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది.
అయితే కన్న బిడ్డను ఆ కసాయి తండ్రి హత్య చెయ్యడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.