- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RRR Case: హైకోర్టులో తులసిబాబుకు ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్

దిశ, వెబ్ డెస్క్: రాఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam Raja) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. నిందితుడు తులసిబాబుకు హైకోర్టు(High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అనంతరం న్యాయమూర్తి(Judge) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కీలక నిందితులు అరెస్ట్ కాలేదని, ఈ కారణంతో బెయిల్(Bail) ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో తులిసిబాబు బెయిల్‌పై పెట్టుకున్న ఆశ నిరాశ అయింది.
కాగా వైఎస్ ప్రభుత్వం హయాంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ మారిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడంపై సీఐడీ కేసులు నమోదు చేసింది. రఘురామను కస్టడీలో తీసుకున్న సీఐడీ పోలీసులు ఆయనను తీవ్రంగా గాయపర్చారు. దీంతో ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఐడీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు తులసిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో బెయిల్ తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా హైకోర్టు డిస్మిస్ చేసింది.