- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు ఉంటుంది : వైసీపీకి నందమూరి బాలకృష్ణ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : దెబ్బకు దెబ్బ..వేటుకు వేటు ఉంటుంది అంటూ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కేసులకు భయపడాల్సింది వైసీపీ వాళ్లేనని తాము భయడాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంలో నందమూరి బాలకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్, తాను, లోకేశ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడను కలిసినట్లు బాలయ్య తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు తమతో చెప్పారన్నారు. అడ్డదారిలో మమ్మల్ని నైతికంగా దెబ్బతీయాలని చూశారు. కార్యాచరణపై చర్చించాం. పవన్ కల్యాణ్ కూడా యుద్ధంలో పాల్గొంటామని చెప్పారు అని అన్నారు. జగన్‌కు మతిస్థిమితం లేదు..పాలన గాలికొదిలేశారు. ఇది ప్రజల దౌర్భాగ్యం అని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలెప్మెంట్ ఫైల్‌లో కనీసం చంద్రబాబు సంతకం కూడా లేకపోయినా జైల్లో పెట్టారు. జగన్ పాలనలో ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియాలు విజృంభిస్తున్నాయి అని బాలయ్య చెప్పుకొచ్చారు. ‘రాష్ట్రం ఎటుపోతుందోనన్న ఆందోళన చంద్రబాబులో ఉంది. యువశక్తి నిర్వీర్యమైంది. చంద్రబాబు కేవలం పాలసీ మేకర్..దానికి ఆయన బాధ్యుడు కాదు. స్కిల్ డెవెలప్మెంట్ ఎండీగా ప్రేమచంద్రారెడ్డే ఉండి నిధులు విడుదుల చేయించారు. 2021లో పెట్టిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరే లేదు. ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లే ఓడిపోతామన్న భయంతోనే కేసులు పెట్టారు’ అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజల్ని తాము కుటుంబంలా భావిస్తాం అని బాలయ్య తెలిపారు. వ్యవస్థలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మహిళలు, వారి కార్యకర్తలపైనే ఈ ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..నియంత ఉన్నారా?’ అనిపిస్తోంది అని బాలకృష్ణ అన్నారు.