- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుసలు కొడుతూ 13 అడుగుల గిరినాగు హల్‌చల్
దిశ, డైనమిక్ బ్యూరో : వర్షాకాలం వచ్చిందంటే చాలు అటవీ ప్రాంతాల్లో ఉండే పాములు జనారణ్యంలోకి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే ప్రజల ప్రాణాలను సైతం బలితీసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. ఎం.కోడూరుకు చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. అయితే ఆ కోళ్లకు మేత వేసేందుకు వెళ్తుండగా గిరినాగు కోళ్లను వెంబడిస్తూ బుసలు కొడుతూ వాటి గూట్లోకి దూరింది. అయితే పాము 13 అడుగులు వరకు ఉండటంతో భయపడ్డాడు. దాన్ని బెదిరించలేక స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్ వెంకటేశ్ ఎం.కోడూరు చేరుకున్నాడు. కోళ్ల గూటిలో నుంచి ఆ గిరినాగును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాదాపు 20 నిమిషాలపాటు శ్రమించి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం ఆ గిరినాగును అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్ల మామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో రైతు ఎలమంచిలి రమేశ్ ఊపిరి పీల్చుకున్నాడు.