AP EAMCET Result 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల

by Mahesh |   ( Updated:2023-06-14 07:00:39.0  )
AP EAMCET Result 2023:  ఎంసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశాడు. ఈ సంవత్సరం మొత్తం ఎంసెట్‌కు 3,38,739 మంది విద్యార్ధులు అప్లై చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ 2,38,180, అగ్రికల్చర్ 1,00,559 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా 2,24,724 మంది ఇంజనీరింగ్‌లో పరీక్షకు హాజరు కాగా ఇందులో 1,71,514 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అలాగే 90,573 మంది అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష రాయగా.. అందులో 81,203 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

మొత్తంగా చూసుకుంటే.. ఇంజనీరింగ్ 76.32 శాతం, అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌ https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspxలో నేరుగా చూసుకొవచ్చిన ఆయన తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2.24 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అలాగే వివిధ కోర్సుల్లో ప్రేవేశాల కోరకు అతి త్వరలో తేధీలు ప్రకటించనున్నారు.

Advertisement

Next Story