- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను చెప్పే వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లోనే నిర్బంధించండి
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అధికార పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.హైకోర్ట్ ఆదేశాలతో ఎన్నికలు నిర్వహిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రతీ అంశంలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. సామరస్యంగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో ఉద్రికత్త నెలకొనేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పెద్దిరెడ్డిని ఈనెల 21వరకు ఇంటికే పరిమితం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ డీజీపీని ఆదేశించారు.
శుక్రవారం ఎన్నికల అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో చిత్తూరు, గుంటూరు పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల ఫలితాలను ప్రకటించొద్దని అధికారులకు సూచించారు. రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో పెండింగులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుండి ఏకగ్రీవాలపై వివరణాత్మక నివేదికను కోరినట్లు తెలిపారు ఈసీ. ఈ రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో నివేదికల పరిశీలన పెండింగ్ లో ఉన్నట్టు వెల్లడించారు.
దీంతో నిమ్మగడ్డ తీరుపై పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.., ఏకగ్రీవాలు కావొద్దని ఏం రాజ్యాంగంలో ఉందో చెప్పాలన్నారు. పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ చెప్పినట్లుగా అధికారులు పనిచేస్తే బ్లాక్లిస్ట్‌లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన నిమ్మగడ్డ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తాము చెప్పినట్లు ఫిబ్రవరి 21వరకు గృహనిర్బంధంలో ఉంచాలని లేఖ రాశారు. మీడియాలో పెద్దిరెడ్డి చేసిన కామెంట్ల క్లిప్పింగ్లను పరిగణలోకి తీసుకొని చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.
నిమ్మగడ్డ లేఖపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ లిఖత పూర్వకంగా లెటర్ అందిస్తే చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.