ఏపీలో రెడ్ జోన్లు ఇవే..!

by srinivas |
ఏపీలో రెడ్ జోన్లు ఇవే..!
X

లాక్‌డౌన్ గడువు ముగియనున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏఏ ప్రాంతాలు ఏఏ జోన్లలోకి వస్తాయన్న చర్చ ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని మూడు జిల్లాలను గతంలో కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా కేంద్రాలు రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఆ జిల్లా కేంద్రాలతో పాటు వివిధ మండలాలు కూడా రెడ్ జోన్ పరిధిలోకి రానున్నాయి.

ప్రయాణ నేపథ్యం అంటే విదేశాలు లేదా ఢిల్లీ ద్వారా సంక్రమించిన కరోనా కేసుల ప్రోగ్రెస్, సామజిక వ్యాప్తి ద్వారా సోకడం, ఒకే ఇంట్లో ఒక్కరి కంటే ఎక్కువ మందికి కరోనా సోకడంతో పాటు, ఒక మండలంలో నాలుగు కేసుల కంటే ఎక్కువైతే ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. అలాగే మండలంలో ఒక పాజిటివ్ కేసు నమోదైతే వాటిని ఆరెంజ్ జోన్‌గా పేర్కొన్నారు. ఏ కేసూ నమోదు కాకపోతే గ్రీన్ జోన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 676 మండలాలు ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం జిల్లా కేంద్రాలతో పాటు, విజయవాడ పట్టణం రెడ్ జోన్‌లో ఉన్నాయి.

అనంతపురం జిల్లాల్లో అనంతపురం, కల్యాణదుర్గం, హిందూపూర్ మండలాలు రెడ్ జోన్‌లో ఉండగా, కొత్తచెరువు ఆరంజ్ జోన్‌లో ఉంది.

చిత్తూరు జిల్లాలో నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్ రెడ్ జోన్‌లో ఉంటే.. నిండ్ర పలమనేరు, ఏర్పేడు మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

ఉభయగోదావరి జిల్లాల్లో శంఖవరం, కొత్తపేట, ఏలూరు, పెనుగొండ మండలాలు రెడ్ జోన్‌లో ఉంటే అడ్డతీగల, కాకినాడ రూరల్, పెద్దాపురం, పిఠాపురం, రాజమండ్రి, ఆకివీడు, భీమడోలు, భీమవరం, నరసాపురం, ఉండి మండలాలు ఆరెంజ్ జోన్‌లోఉన్నాయి.

గుంటూరు జిల్లాలో మాచర్ల, అచ్చంపేట రెడ్ జోన్ కెళ్తే.. చేబ్రోలు, కారంపూడి, క్రోసూరు, మంగళగిరి, మేడికొండూరు, పొన్నూరు మండలాలు ఆరెంజ్ జోన్

కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పులివెందుల, కడప రెడ్ జోన్‌లో ఉండగా, ఆరెంజ్ జోన్‌లో బద్వేలు, మైదుకూరు, వేంపల్లె మండలాలున్నాయి.

కృష్ణా జిల్లాలో నూజివీడు, మచిలీపట్నం రెడ్ జోన్లో ఉంటే… జగ్గయ్యపేట, పెనమలూరు మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బనగానపల్లె, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, శిరువెళ్ల మండలాలు రెడ్ జోన్‌లో ఉంటే బేతంచర్ల, చాగలమర్రి, గడివేముల,గూడూరు, ఓర్వకల్లు, అవుకు, ఉయ్యాలవాడ మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో నాయుడు పేట, వాకాడు, తడ, బుచ్చిరెడ్డి పాలెం రెడ్ జోన్‌లో ఉంటే.. ఆలూరు, బాలాయపల్లి, గూడూరు, భోగోలు, ఇందుకూరు పేట, కావలి కోవూరు, ఓజిలి, తోటపల్లి గూడూరు మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు, చీరాల, కారంచేడు, కందుకూరు మండలాలు రెడ్ జోన్ అయితే, కనిగిరి, కొరిశపాడు, మార్కాపురం, పొదిలి మండలాలు ఆరెంజ్ జోన్.

విశాఖ జిల్లాలో నర్సీపట్నం, పద్మనాభం మండలాలు రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ లేదు

కర్నూలు జిల్లాలో 8 మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.

అలాగే నెల్లూరు జిల్లాలో మరో ఐదు మండలాలు చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నాలుగు చొప్పున మండలాలు, గుంటూరు జిల్లాలో మూడు మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉండడం విశేషం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పూర్తిగా గ్రీన్ జోన్‌లో ఉన్నాయి.

రెడ్ జోన్‌లో మరో 14 రోజులపాటు పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ జోన్ల పరిధిలో పూర్తి స్థాయి పోలీసు గస్తీ అమలులో ఉంటుంది. ఇక్కడి ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలు లేదు. నిత్యావసర వస్తువులతోపాటు ఇతర అన్ని వస్తువులు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఆరెంజ్ జోన్‌లో ఆంక్షల పాక్షిక సడలింపు అమలులో ఉంటుంది. గ్రీన్ జోన్‌లో మాస్కులు ధరించి అన్ని కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు.

tags: andhrapradesh, zones in ap, red zone, lockdown

Advertisement

Next Story

Most Viewed