ఏపీ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా

by srinivas |
ఏపీ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా మరో 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై కరోనా వైరస్‌ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే 10,774 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కింద మరో 5,631 రూపాయలు చెల్లించనున్నారు. కరోనా లక్షణాలకు వైద్యమందిస్తే ఒక పేషెంట్‌కు 16,405 రూపాయలు చెల్లించనున్నారు.

అలాగే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే మాత్రం ఆరోగ్య శ్రీలో భాగంగా 65 వేల రూపాయల నుంచి 2.15 లక్షల రూపాయల వరకు ఆసుపత్రికి చెల్లించనున్నారు. అయితే కరోనా కేసు తీవ్రతను బట్టి ఈ ప్యాకేజీ మారుతుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఆ శాఖ ప్రకటించింది. కాగా, ఎపిడెమిక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్ట్ కింద ఏపీలో 500 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

Tags: coronavirus, corona treatment, aarogyasri, hospitals

Advertisement

Next Story

Most Viewed