మరోసారి జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

by srinivas |

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించడంతో జగన్ ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన న్యాయస్థానం ఆ జీవోపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసుల తరలింపు ఆగిపోయింది. హైకోర్టు మధ్యంత ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులను ఆలోచనలో పడేసింది. నిన్ననే ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోయేందుకు సమావేశమైన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారు ఆలోచనలో పడ్డారు.

Tags: high court, ap government, offices shifting, stay order



Next Story

Most Viewed