- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరింత పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతుంది. ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 65 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకూ మొత్తం 4,261 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇందులో 1641 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకి చికిత్స పొందుతుండగా, మరో 2540 మంది కరోనాకు చికిత్స తీసుకుని, కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కరోనాతో ఏపీలో ఇప్పటి వరకు 80 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. మరోవైపు ఏపీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించటంలో రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు 5,10,318 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. మిలియన్ జనాభాకు 9,557 మందికి కరోనా పరీక్షలు చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య 54.67 శాతానికి పెరిగిందని ప్రకటించింది.