- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్టింగ్ సర్వే.. టాప్‌లో ఎంపీ రఘురామ.. అట్టడుగున ఆ ఎంపీలు..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నర్సాపురం నియోజకవర్గం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో విషయంలో సంచలనంగా మారారు. లోక్‌సభ ఎంపీల పనితీరుకు సంబంధించి పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఎంపీల పనితీరు, పార్లమెంట్ హాజరుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
పార్లమెంట్ అధికారిక సమాచారం ప్రకారం ఏపీ ఎంపీల పనితీరును వివరించారు. ఈ నివేదికలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు టాప్‌లో నిలిచారు. ఓవరాల్‌గా చూస్తే.. రఘురామ అటెండెన్స్ 96 శాతంగా ఉంటే.. 50 డిబేట్స్‌లో పాల్గొన్నారు.. 145 ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన టాప్ ప్లేస్‌లో నిలిచారు. అయితే.. అటెండెన్స్ విషయంలో రఘురామ టాప్‌లో ఉండగా.. గల్లా జయదేవ్ రెండు, కేశినేనాని మూడో స్థానంలో నిలిచారు.
రెండో స్థానంలో ఉన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అటెండన్స్ 89 శాతం కాగా.. 54 డిబేట్స్‌లో పాల్గొన్నారు.. 133 ప్రశ్నలు అడిగారు. మూడో స్థానంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఆయన అటెండన్స్ 89శాతం, 14 డిబేట్స్‌లో మాత్రమే పాల్గొన్నారు.. 77 ప్రశ్నలు అడిగారు.
డిబేట్ల విషయానికి వస్తే.. గల్లా జయదేవ్ 54, రఘురామ 50, రామ్మోహన్‌నాయుడు 49తో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రశ్నల విషయానికి వస్తే.. కాకినాడ ఎంపీ వంగా గీత 173, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 162, నర్సాపురం ఎంపీ రఘురామ 145 ప్రశ్నలు అడిగారు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విచిత్రంగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదని రిపోర్ట్‌లో తెలిపారు. ఇక అటెండెన్స్, డిబేట్లు, ప్రశ్నల విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆఖరి స్థానంలో ఉన్నారు. ఆయన హాజరు 32శాతంగా ఉంది.