చిలుకా క్షేమమా.. అంటున్న అనసూయ!

by Jakkula Samataha |   ( Updated:2020-07-19 05:28:06.0  )
చిలుకా క్షేమమా.. అంటున్న అనసూయ!
X

బుల్లితెరపైనే కాక వెండితెరపైనా తనను తాను ప్రూవ్ చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. టీవీ షోస్, అవార్డ్స్ ఫంక్షన్స్‌లో యాంకర్‌గా చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో తళుక్కున మెరుస్తోంది. ఇక జబర్ధస్త్‌ కామెడీ షోతో తెలుగు వారికి దగ్గరైన ఈ భామకు పక్షులంటే ఎనలేని ప్రేమ. తన ఇంట్లో పెంచుకుంటున్న ‘మకావ్’ చిలుకలతో అప్పుడప్పుడు ఆడుకుంటూ.. ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె తన చిలుకతో కలిసి పాట పాడిన వీడియోను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. ‘చిలుకా క్షేమమా.. కులుకా కుశలమా? అంటూ అనసూయ తన గొంతు వినిపించింది.

అయితే ఇప్పటికే యాక్టర్‌గా, యాంకర్‌గా కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. రాబోయే రోజుల్లో ‘సింగర్’గానూ చాన్స్ ఇవ్వమని చెప్పకనే చెబుతుందా? అంటే అవునేమో! ఎందుకంటే గతంలో ఓ సారి తనకు సింగర్‌గా రాణించాలనుందని తన మనసులో మాట బయటపెట్టింది అనసూయ. అంతేకాదు.. రఘు కుంచె, అనూప్ రూబెన్స్ తనతో ఆడిషన్స్ కూడా నిర్వహించారని చెప్పింది. అదీగాక ఓసారి అమెరికాలో దేవీ శ్రీ ప్రసాద్ లైవ్ షోకు యాంకర్‌గా చేసిన అనసూయ.. అక్కడ కూడా అప్పుడప్పుడు దేవీకి తన గళాన్ని వినిపించానని తెలిపింది. ఇక దేవీశ్రీ కూడా కొత్త గొంతులతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. ఈ క్రమంలో నటి కలర్స్ స్వాతితో.. 100% లవ్ సినిమాలో పాట పాడించిన విషయం తెలిసిందే. మరి అనసూయ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. మళ్లీ ఆ స్థాయి పాత్రలో కనిపించలేదు. అయితే, ప్రస్తుతం అనసూయ చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం. సుకుమార్-బన్నీ కాంబోలో వస్తున్న ‘పుష్ప’, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’తో పాటు చిరంజీవి, కొరటాల కలయికలో వస్తున్న ‘ఆచార్య’లోనూ అనసూయ నటిస్తున్నారు.

Advertisement

Next Story