‘ఖిలాడి’ గేమ్ చేంజర్.. అనసూయ!

by Shyam |
‘ఖిలాడి’ గేమ్ చేంజర్.. అనసూయ!
X

దిశ, సినిమా: జబర్దస్త్ బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కు సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న భామ.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్‌తో ఈ మధ్యే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేట్లుగానే ఉండగా.. దీంతో పాటు మరో గుడ్ న్యూస్ చెప్పింది అనసూయ.

‘క్రాక్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ రవితేజ నెక్స్ట్ ఫిల్మ్ ‘ఖిలాడి’లో కీలకపాత్ర చేస్తున్నట్టుగా వెల్లడించింది. ‘ప్లే స్మార్ట్’ అనేది సినిమా క్యాప్షన్‌గా గేమ్ చేంజర్ అనసూయకు వెల్ కమ్ చెప్తూ అఫిషియల్‌గా అనౌన్స్‌ చేసింది ఖిలాడి టీమ్. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పి, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టర్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. కాగా మే 28న థియేటర్స్‌లోకి రాబోతున్నాడు ‘ఖిలాడి’.

https://twitter.com/DirRameshVarma/status/1356826048055234562?s=20

Advertisement

Next Story