జబర్దస్త్ చరిత్రలో నేను సైతం : అనసూయ

by Shyam |
జబర్దస్త్ చరిత్రలో నేను సైతం : అనసూయ
X

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడూ నెటిజన్లతో చర్చకు దిగడం.. ఏదో టాపిక్‌పై రచ్చ చేస్తూ వార్తల్లో నిలవడం పరిపాటే. అయినా సరే సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూనే ఉంటుంది. ఇక బుల్లితెర షూటింగ్స్ మొదలు కావడంతో హ్యాపీగా ఫీలైన అనసూయ.. టీవీ షోస్‌లో జబర్దస్త్ ఒక చరిత్ర సృష్టించిందని తెలిపింది. అందులో తనకూ భాగం ఉందని .. తన వల్ల కూడా షోకు హైప్ క్రియేట్ అయిందని చెప్పింది. జబర్దస్త్ చరిత్రలో ఇది లిఖించబడి ఉంటుందని చెప్పింది.

‘పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న సమయంలో.. రష్మి గౌతమ్ తన ప్లేస్‌లో వచ్చింది తప్ప.. తనను ఎవరూ వెళ్లమని చెప్పలేదు. ఇప్పుడు జబర్దస్త్ జడ్జ్ నాగబాబు కూడా వెళ్లిపోయారు. అంటే మేము కావాలని వెళ్లిపోవడమే కానీ మల్లెమాల సంస్థ ఎప్పుడూ ఎవరినీ వెళ్లమని చెప్పలేదని’ తెలిపింది.

Advertisement

Next Story