- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిన ఐడియా.. మెచ్చిన ఆనంద్ మహీంద్రా
దిశ, వెబ్‌డెస్క్ : ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తనకు నచ్చిన విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమస్యకు తమదైన క్రియేటివిటీని జోడించి పరిష్కారం చూపే ఆలోచనాపరుల వీడియోలను చూసి ముచ్చటపడుతుంటారు. వారి క్రియేటివిటీకి, జుగాడ్ ఐడియాలకు ఫిదా అవుతుంటారు. ఆయా ఐడియాలకు టెక్నాలజీ జత కలిస్తే అద్భుతాలు ఆవిష్కారమవుతాయని సలహా కూడా ఇస్తుంటారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో ఓ వైన్స్ షాపు యజమాని జుగాడ్ ఐడియాను మెచ్చుకుంటూ వీడియో పోస్ట్ చేశారు.
లాక్‌డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా.. వైన్స్ షాపులు తెరుచుకోవడంతో జనాలంతా వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. దీనివల్ల వైరస్ సమూహ వ్యాప్తి పెరుగుతుందని ఓ వైపు డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. అయినా మందుబాబులతో పాటు చాలా మంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. దాంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలే స్వయంగా మద్యం ‘ఆన్‌లైన్’ కొనుగోళ్లకు తెరతీశారు. మందుబాబుల తీరుకు టెక్నాలజీతో చెక్ చెప్పారు. అయితే బీహార్‌లోని ఓ వైన్స్ షాప్ ఓనర్ మాత్రం.. సోసల్ డిస్టెన్స్‌తో పాటు, కాంటాక్ట్‌లెస్ మద్యం అందించడానికి తనదైన టెక్నిక్‌తో పరిష్కారం చూపించాడు. అదేంటంటే.. షాప్ ముందు 4-5 అడుగుల పొడవుండే.. పైపును అమర్చాడు. ప్లాస్టిక్ బాటిల్‌కు ఓ తాడుకట్టి ఆ పైపులో నుంచి జారవిడుస్తారు. కస్టమర్ అందులో మనీ పెట్టగానే.. అటు నుంచి సీసా జారువిడుస్తారు. కస్టమర్ దాన్ని ఒడుపుగా పట్టుకోవాలి. ఇదే ఐడియాకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఇలాంటి ఐడియాను కేరళలోని రేషన్ షాపుల్లోనూ అమలు చేసిన విషయం తెలిసిందే.