- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రతీక్షణం మలుపులతో ‘హైవే’..
by Shyam |

X
దిశ, సినిమా : ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘హైవే’ షూటింగ్ పూర్తయింది. కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి నిర్మిస్తుండగా.. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగినట్లు తెలిపారు.
హైవే నేపథ్యంలో సాగే ఈ సైకో థ్రిల్లర్ మూవీలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించినట్లు తెలిపారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్న దర్శకనిర్మాతలు.. ప్రతీక్షణం ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుందన్నారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారని, త్వరలోనే క్రేజీ అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తామని తెలిపారు. నిర్మాత తలారి వెంకట్‌కు ‘చుట్టాలబ్బాయి’ తొలి సినిమా కాగా, 118 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు దర్శకులు కేవీ గుహన్.
Next Story