సీఎం కూతురు పేరిట భూములు ఇన్ సైడ్ ట్రేడింగేనా !

by Anukaran |
సీఎం కూతురు పేరిట భూములు ఇన్ సైడ్ ట్రేడింగేనా !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు, మహిళలు సోమవారం బహిరంగ లేఖ రాశారు. జూన్ 2, 2014 నుంచి రాజధాని ప్రకటన వరకు అమరావతిలో క్రయ విక్రయాలు జరిగింది కేవలం 128ఎకరాలు మాత్రమేనని లేఖలో స్పష్టం చేశారు. పేద రైతుల పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం జరిపిన విక్రయాలు కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటున్నారని, అయితే కడపలో సీఎం కుమార్తె పేరిట కొన్న భూములు కూడా ఇన్‌సైడ్ ట్రేడింగానే భావించాలా అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల మాటున రాష్ట్రంలో పెద్ద ఎత్తున వన్‌ సైడ్‌ ట్రేడింగ్ జరుగుతోందని, భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై అవినీతి ముద్ర వేస్తున్నారని రైతులు పేర్కొన్నారు.

రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, అలాగే అమరావతిని కాపాడేలా పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రధాని మోడీకి రైతులు విజ్ఞప్తి చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరిట రాజధాని రైతులపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నా.. సిట్, సీఐడీ, సబ్ కమిటీ పేర్లతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులతో న్యాయబద్ధంగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం లేదన్నారు.

Read Also…

‘ఫిబ్రవరిలోగా రథం సిద్ధం చేస్తాం’

Advertisement

Next Story