- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హృదయాన్ని కదిలించిన సన్నివేశం.. తండ్రి భుజాలపైకి ఎక్కిన తమ్ముడికి కిటికిలో నుంచి రాఖీ కట్టిన అక్కలు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా హృదయాన్ని కదిలించే సన్నివేశం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాల లోపలికి అనుమతించకపోవడంతో బయట కిటికీ నుంచి తమ్ముడు అక్కలతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సమయంలో తండ్రి భుజంపై బాలుడు కూర్చునే సన్నివేశం అందరినీ కదిలిస్తోంది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో అశ్విక, సహస్ర అనే ఇద్దరు చిన్నారులు చదువుతున్నారు. సోమవారం రాఖీ పండుగ కావడంతో అక్కలతో రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్ర ఎంతో ఉత్సాహంగా వచ్చాడు. తీరా పాఠశాల సిబ్బంది లోనికి అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో చేసేదేం లేక తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలోంచి అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో వీడియో చూసిన అందరూ అక్కాతమ్ముడి ప్రేమను ప్రశంసించడంతో పాటు పాఠశాల సిబ్బందిపై మండిపడుతున్నారు.
Read More..