మైక్రోసాఫ్ట్‌లో బగ్.. ఇండియన్ రీసెర్చర్‌కు 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ

by Harish |   ( Updated:2021-03-04 09:12:04.0  )
మైక్రోసాఫ్ట్‌లో బగ్.. ఇండియన్ రీసెర్చర్‌కు 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ
X

దిశ, ఫీచర్స్ : యాప్స్, వెబ్‌సైట్స్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్స్‌లో తలెత్తే లోపాలను బగ్స్‌గా చెబుతుంటారు. ఆ బగ్స్ వల్ల సదరు ప్రోగ్రామ్ సరిగా రన్ కాకపోవడంతో పాటు హ్యాకర్లు సులభంగా కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించి, విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. అందుకే ప్రముఖ యాప్స్‌.. బగ్స్ కనిపెట్టిన వారికి లక్షలు, కోట్లలో ప్రైజ్‌మనీ అందిస్తుంటాయి. ఈ క్రమంలో ‘మైక్రోసాఫ్ట్ హ్యాకర్ వన్’ ప్రోగ్రాం కింద బగ్ కనిపెట్టిన ఇండియన్ రీసెర్చర్ లక్ష్మణ్ ముథియాకు 50,000 డాలర్లు బహుమతిగా అందడం విశేషం.

మైక్రోసాఫ్ట్ ఖాతాలను హైజాక్ చేయడానికి గురిచేసే బగ్‌ను గుర్తించినందుకుగాను లక్ష్మణ్ ముథియాకు నగదు బహుమతి లభించింది. లక్ష్మణ్ గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్ రేట్‌ లిమిటింగ్ చేసే బగ్‌ను కనుగొన్నాడు. ఈ బగ్ వల్ల మనం ఈజీగా వేరొకరి అకౌంట్‌ను హైజాక్ చేయొచ్చు. అంటే యూజర్ అనుమతి లేకుండానే ఎవరైనా ఏదైనా ఇన్‌స్టా ఖాతాను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించవచ్చు. కాగా ఇలాంటి బగ్ మైక్రోసాఫ్ట్‌‌లో కూడా ఉందేమోనన్న అనుమానంతో చెక్ చేసిన లక్ష్మణ్.. అందులోనూ సేమ్ బగ్‌ను గుర్తించి, మైక్రోసాఫ్ట్‌కు దాని గురించి వివరిస్తూ లేఖ రాశాడు. రిపోర్ట్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ స్పందించడంతో పాటు తనకు క్యాష్ ప్రైజ్ అందించిందని తెలిపాడు.

https://twitter.com/LaxmanMuthiyah/status/1366767274720329729

మైక్రోసాఫ్ట్ హ్యాకర్ వన్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా క్యాష్ అవార్డు ఇస్తుండగా, బగ్స్ కలిగించే నష్టాన్ని బట్టి మైక్రోసాఫ్ట్ 15వందల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు రివార్డ్ ప్రైజ్ విలువను నిర్ణయిస్తుంది. ఫేస్‌బుక్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ‘బగ్ బంటీ’ ప్రోగ్రాంను నిర్వహిస్తూ, భారీ మొత్తంలో ప్రైజ్ మనీ అందిస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed