ఈ అవకాశం మీ కోసమే

by Shamantha N |
ఈ అవకాశం మీ కోసమే
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభత్వం మీకోసం మరో అవకాశం కల్పించింది. ఇదే చివరి అవకాశమని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. జూలై 18 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జేఈఈ-మెయిన్స్ పరీక్ష కోసం ఈ నెల 24వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది. అదేవిధంగా ఇంతకుముందు దరఖాస్తు చేసిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 25 నుంచి 31 వరకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. కానీ తుది నిర్ణయం మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీదేనని తెలిపింది.

Advertisement

Next Story