- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మ వద్దకు నేను వెళ్లను..
మారుతీరావు మరణం తరువాత మీ అమ్మగారి వద్దకు వెళ్తారా.. మీ తండ్రి సూసైడ్ నోట్‌లో అదే రాశారు కదా అని మీడియా అమృతను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆమె నేను అమ్మ దగ్గరికి వెళ్లను, కావాలంటే తను నావద్దకు రావొచ్చని తెలిపారు. అయితే తన తండ్రిని కడసారి చూడలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నాన్నను బాబాయ్ కొట్టారనే విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. మారుతీరావుకు కరీం అనే వ్యక్తి బినామీ అని, తన తండ్రి ఆస్తి మీద తనకు ఏమాత్రం ఆశ లేదని అమృత స్పష్టం చేసింది. నాన్న బతికి ఉన్నప్పుడు తనను ఇంటికి తీసుకువెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ నేనే అందుకు అంగీకరించలేదని వివరించింది. చివరకు తన భర్తను చంపాననే పశ్చాత్తాపం, జైలు జీవితం గడపాల్సి వస్తుందనే బాధతో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలిపింది.
Tags: maruthi rao, suicide, pranay, amrutha, mother, baby, karim