- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమరావతి రూపశిల్పి చంద్రబాబు: ఎంపీ రఘురామకృష్ణంరాజు
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు పొగడ్తల వర్షం కురిపించారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు అని కొనియాడారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొందించారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం.. భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు చంద్రబాబు అమరావతి ద్వారా నాంది పలికారన్నారు. అయితే ఆ ఆకాంక్ష విలువ వైసీపీ తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన మహోద్యమ సభకు ఎంపీ రఘురామ హాజరయ్యారు. వేదిక పై టీడీపీ అధినేత చంద్రబాబును కౌగిలించుకున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.
అనంతరం ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్ర చరిత్రలో ఓ అధ్యయనం అని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని అయినప్పటికీ మొక్కవోని దీక్షతో మహిళలు ముందుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. చివరికి బయో టాయిలెట్లను కూడా అడ్డుకున్నారన్నారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటి రాదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని ఎంపీ రఘురామ కొనియాడారు. రాజధాని అమరావతిని మార్చడం ఎవరివల్లా కాదని పునరుద్ఘాటించారు. కొంతకాలం ఓపిక పడితే అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.