రైతుల పిటిషన్లపై నేటి నుండే విచారణ 

by  |
రైతుల పిటిషన్లపై నేటి నుండే విచారణ 
X

దిశ, వెబ్ డెస్క్: ఈరోజు నుండి ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ కొనసాగనుంది. నేడు 93 పిటిషన్‌లు ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్‌రావు కమిటీ, హై పవర్ కమిటీల చట్టబద్దతపై రాజధాని రైతులు పిటిషన్లు వేశారు. సీర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పంద ఉల్లంఘనపై కేసులు ఫైల్ అయ్యాయి. రాజధానిలో మాస్టర్ ప్లాన్ డివియేషన్‌పైన, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైన రైతులు కేసులు వేశారు.

అలాగే రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 సీఆర్పీసీ విధింపును రైతులు ఛాలెంజ్ చేశారు. కాగా పరిపాలన రాజధాని తరలింపు కోసం చేసిన చట్టంపై ఇప్పటికే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఈరోజు ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను ధర్మాసనం విచారించనుంది.


Next Story

Most Viewed