రాష్ట్రం పేరు తప్పుగా ట్వీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక దేశానికి అధ్యక్షుడు అయ్యుండి తను పాలిస్తున్న దేశంలోని ఒక రాష్ట్రం పేరును తప్పుగా ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. సూపర్ బౌల్ మొదటి గేమ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో 49అర్స్ మీద కేన్సస్ సిటీ చీఫ్స్ జట్టు ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేన్సస్ జట్టును అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఎంతో ఒత్తిడికి లోనైనప్పటికీ […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక దేశానికి అధ్యక్షుడు అయ్యుండి తను పాలిస్తున్న దేశంలోని ఒక రాష్ట్రం పేరును తప్పుగా ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.
సూపర్ బౌల్ మొదటి గేమ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో 49అర్స్ మీద కేన్సస్ సిటీ చీఫ్స్ జట్టు ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేన్సస్ జట్టును అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఎంతో ఒత్తిడికి లోనైనప్పటికీ గట్టి విజయంతో తిరిగొచ్చారని ఆయన కేన్సస్ జట్టుని పొగిడారు. మీరు కేన్సస్ రాష్ట్రం పేరును, మొత్తం అమెరికా పేరును నిలబెట్టారని కొనియాడాడు. అయితే ఇక్కడ ట్రంప్ చేసిన అచ్చుతప్పు ఏంటంటే కేన్సస్ అనేది రాష్ట్రం కాదు, మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం.
ఈ తప్పు చూసి నెటిజన్లు ట్రంప్ మీద విరుచుకుపడుతున్నారు. ఇడియట్ ఆ మాత్రం తెలియదా? అంటూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్వీట్లలో తప్పులు చేయడం ట్రంప్‌కి కొత్తేమీ కాదు. అయితే అవి కావాలని చేస్తాడో లేక తెలియకుండా చేస్తాడో అర్థం కాదు.